Home /News /politics /

CM KCR TO MEET UDDHAV THACKERAY ON FEB 20 TO DISCUSS ANTI BJP FRONT SHIV SENA PRAISE TRS FIGHT ON PM MODI MKS

CM KCR యుద్ధానికి శివ సైన్యం మద్దతు -20న ఉద్ధ‌వ్‌తో కేసీఆర్ భేటీ -ఇవాళ ఫోన్‌లోనే అజెండా ఖరారు

కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్

కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్

బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఇప్పటికే మొదలుపెట్టిన సమరానికి తాము కూడా మద్దతిస్తామని, కలిసి పోరాడుతామని ప్రకటనలు చేస్తోన్న ముఖ్యనేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహా సీఎం ఠాక్రే ఇవాళ కేసీఆర్ కు ఫోన్ చేశారు..

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్దాలతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, ఢిల్లీ గద్దె నుంచి మోదీని, బీజేపీని దించేదాకా పోరాడుతానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ మోగించిన యుద్ధభేరికి అనూహ్య స్పందనలు వస్తున్నాయి. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఇప్పటికే మొదలుపెట్టిన సమరానికి తాము కూడా మద్దతిస్తామని, కలిసి పోరాడుతామని ప్రకటనలు చేస్తోన్న ముఖ్యనేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం నాడు బెంగాల్ సీఎం మమత, మంగళవారం నాడు మాజీ ప్రధాని దేవేగౌడ కేసీఆర్ కు ఫోన్లు చేయగా, ఇప్పుడు శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్ధవ్ ఠాక్రే కేసీఆర్ కు కాల్ చేసి కలిసిపోరాడుదామన్నారు. భేటీకి ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది..

బీజేపీ, మోదీపై పోరులో భాగంగా కలిసివచ్చే శక్తులను సమీకరిస్తానన్న సీఎం కేసీఆర్ ఆదిశగా కీలక అడుగు వేయనున్నారు. గులాబీ బాస్ మహారాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 20వ తేదీన ముంబైలో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం సీఎం కేసీఆర్‌కు ఉద్ధ‌వ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఆయ‌న సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు.

CM KCR పెద్ద యుద్ధానికి దిగారు.. మాజీ ప్రధాని అనూహ్య మద్దతు.. ఇక మిగిలింది ఆ ముగ్గురే!


ఈ సందర్భంగా ఠాక్రే ‘కేసీఆర్ జీ.. మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం. మిమ్మల్ని ముంబై ఆహ్వానిస్తున్నా. మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుకుందాం’ అని ఫోన్లో కేసీఆర్‌తో అన్నట్లు తెలంగాణ సీఎంవో పేర్కొంది. తద్వారా ఇద్దరు సీఎంల సమావేశానికి అజెండా ఫోన్ లోనే ఖరారైంది.

Surgical strike ఆధారాలివిగో : ఆర్మీని బద్నాం చేసిన CM KCR: అస్సాం సీఎం దిమ్మతిరిగే కౌంటర్ Video


సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన వరుస ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో బీజేపీపై పోరును ఉధృతం చేయడం, ప్రధాని మోదీ విధానాలను ఎండగట్టడం తెలిసిందే. కేసీఆర్ ప్రెస్ మీట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సోమవారం నాడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రస్తుత మోదీ సర్కార్ ఇబ్బంది పెడుతోన్న వైనంపై, తదుపరి పోరాటంపై వారు చర్చించారు. ఇక మంగళవారం కేసీఆర్ కు ఫోన్ చేసిన మాజీ ప్రధాని దేవేగౌడ.. ‘మీరు పెద్ద యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో మేమంతా మీకు తోడుగా ఉన్నాం. మనమంతా మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలి’అని చెప్పారు. ఇప్పుడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సైతం బీజేపీపై ఉమ్మడిగా పోరాడుదామని కేసీఆర్ కు స్నేహహస్తం అందించారు. ఈ పరిణామాల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Mumbai, Shiv Sena, Trs, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు