news18-telugu
Updated: December 2, 2020, 7:43 AM IST
సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఇవాళ నిజామాబాద్ (Nizamabad_లో పర్యటించనున్నారు. మక్లూరుకు వెళ్లి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా (Ganesh Gupta) కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం వెళ్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు మక్లూరుకు చేరుకొని.. తిరిగి 2 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సి పి కార్తికేయ పరిశీలించారు.
మంగళవారం నాడు సంబంధిత అధికారులతో కలిసి నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో పర్యటించి హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా పోలీస్, ఫైర్, వైద్య, ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లతో పాటు కోవిడ్ నిబంధనలను విధులు నిర్వహించే సిబ్బందితోపాటు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా విద్యుత్ సరఫరా ఆటంకం లేకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులు అందరూ నిర్ణీత సమయానికి ఆయా శాఖలకు సంబంధించిన నోట్స్‌తో హాజరుకావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, లత, జిల్లా ఫైర్ అధికారి, డిఎంఅండ్‌హెచ్‌వో సుదర్శనం, ఇతర అధికారులు పాల్గొన్నారు
Published by:
Shiva Kumar Addula
First published:
December 2, 2020, 7:37 AM IST