CM KCR SUGGESTIONS TO TRS LEADERS REGARDING ETELA RAJENDAR CONSTITUENCY HUZURABAD AK
KCR Vs Etela Rajendar: టార్గెట్ ఈటల.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ కొత్త టార్గెట్
ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Kcr Vs Etela Rajendar: హుజూరాబాద్‌లో ఇప్పటికే పలు పర్యాయాలు విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దని డిసైడయిన టీఆర్ఎస్.. అక్కడి ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మండల, గ్రామస్థాయి టీఆర్ఎస్ నేతలు పార్టీ వీడకుండా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
మాజీమంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనుండటంతో.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని.. ఆ రకంగా ఆయనకు చెక్ చెప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడే హుజూరాబాద్‌పై పలువురు మంత్రులు ఫోకస్ చేశారని.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈటల రాజేందర్‌తో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు చెక్ చెప్పడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టు అవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించగలిగితే.. ఈటల రాజేందర్‌పై పైచేయి సాధించడంతో పాటు బీజేపీపై కూడా అప్పర్ హ్యాండ్ అవుతుందనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. అక్కడ ఫలితం మాత్రం కచ్చితంగా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే విధంగా ముందుగానే గ్రౌండ్ వర్క్ చేయాలని టీఆర్ఎస్ నేతలను, మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్‌లో ఇప్పటికే పలు పర్యాయాలు విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దని డిసైడయిన టీఆర్ఎస్.. అక్కడి ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మండల, గ్రామస్థాయి టీఆర్ఎస్ నేతలు పార్టీ వీడకుండా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగలు కమలాకర్‌తో పాటు మంత్రి హరీశ్ రావు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.