సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం.. వైద్యులు ఏం చెప్పారంటే..

అస్వస్థతతో సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది.

news18-telugu
Updated: January 22, 2020, 9:29 AM IST
సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం.. వైద్యులు ఏం చెప్పారంటే..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
అస్వస్థతతో సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. సుమారు 9 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి కూడా ఆస్పత్రికి వచ్చారు. సుమారు గంటపాటు ఆయనకు పలు రకాల టెస్టులు నిర్వహించినట్టు తెలిసింది. టెస్టు రిపోర్టులన్నీ పరిశీలించిన వైద్యులు.. సాధారణ జ్వరమేనని, అయితే విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు.

సంక్రాంతి పండుగ కోసం కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లగా, రెండు రోజుల నుంచి జ్వరంగా ఉండడంతో నిన్న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ వచ్చారు. అయితే.. రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరగడంతో పాటు, హైబీపీ కూడా వచ్చినట్టు తెలిసింది. దీంతో కుటుంసభ్యులు వెంటనే సీఎంను ఆస్పత్రికి తరలించారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు