నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కవిత నామినేషన్ వేశారు. ఆమె గెలుపు దాదాపు లాంఛనమే. దీంతో అసలు కవితను ఎమ్మెల్సీ చేయడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏమిటనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కవితకు ఎమ్మెల్సీ పదవి ఖాయం కావడంతో...అందరి ఆలోచన ఆమెకు మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందనే దానిపైనే ఉంది. సాధారణంగా కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవనే విషయం అందరికీ తెలిసిందే. కవిత విషయంలోనూ ఆయన ఇదే రకంగా వ్యవహరించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. చాలామంది కవితకు రాజ్యసభ సీటు ఖాయమని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచించారు.
కవితను రాజ్యసభకు పంపకుండా రాష్ట్రంలోనే కీలకం చేయాలని నిర్ణయించారు. దీంతో ఆమెను అనూహ్యంగా ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించుకున్నారు. కవిత ఎమ్మెల్సీ కావడం ఖాయం కావడంతో... ఆమెకు మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ కేబినెట్లో కేటీఆర్, హరీశ్ రావు మంత్రులుగా ఉన్నారు. కేబినెట్ కూడా పూర్తిస్థాయిలో కొలువు తీరింది. దీంతో కవితను ఏ రకంగా కేబినెట్లోకి తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి తొమ్మిది నెలల పాటు రాజకీయాల్లో సెలైంట్‌గా ఉన్న కవిత... తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి భూమిక పోషించబోతున్నారన్న దానిపై క్లారిటీ రావడానికి మరికొన్ని రోజులు పట్టేలా కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.