Dalitha Bandhu- CM KCR: రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు.. పైసలు రాగానే ఆగమాగం కావద్దు.. సీఎం కేసీఆర్

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

  • Share this:
    రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు అందజేయనున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి‌లో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో కీలకమైన పథకాలను కరీంనగర్ నుంచి ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళిబంధు నిధులు ఇస్తామని చెప్పారు. అతి తక్కువ ఉపాధి, ఆదాయం ఉన్నవారు ఎస్సీలు అని సీఎం అన్నారు. ఎస్సీల పట్ల వివక్ష ఇంకెన్ని కొనసాగాలని ప్రశ్నించారు. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ. 2 వేల కోట్లు మంజూరు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

    రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్ఛయ్యేది రూ. 1.30 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. నిధులకు భయపడకుండా దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ బొజ్జాను సీఎంవోలో కార్యదర్శిగా నియమిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు చివరి దశలో దళిత బంధు అమలు చేస్తామని కూడా తెలిపారు. దళిత బంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చని అన్నారు. దళిత బంధు కింద ఇచ్చే డబ్బులకు కీస్తిల కిరికిరి లేదన్నారు. దళిత బంధు డబ్బులు 100 శాతం సబ్సిడీతో ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధు నిధులతో ఎక్కడైన సరే వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు.

    పైసలు రాగానే ఆగమాగం కావద్దని సీఎం సూచించారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఏది లాభసాటో తెలుసుకోని ముందుకు సాగాలని సూచించారు. ఇందుకు సంబంధించి సమాచారం తెలియకుంటే.. అధికారుల సాయం తీసుకోవాలని కోరారు.

    తన మొదడు కరగబెట్టి దళిత బంధుకు రూపకల్పన చేసినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. తాను తెచ్చిన పథకాలను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేయలేదని అన్నారు. దళిత బంధు లబ్దిదారులకు ఇతర పథకాలు యథాతథంగా అమలు అవుతాయని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: