ఆ జిల్లాపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్... ఏం జరుగుతోంది ?

Nizamabad: నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును దక్కించుకున్న టీఆర్ఎస్... తాజాగా నిజామాబాద్ జిల్లాపై మళ్లీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 20, 2020, 8:15 AM IST
ఆ జిల్లాపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్... ఏం జరుగుతోంది ?
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా... దాని వెనుక ఎన్నో వ్యూహాలు ఉంటాయి. అందుకే ఆయన తీసుకునే నిర్ణయాల పర్యవసానాలు ఎలా ఉంటాయనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తుంటాయి. తాజాగా తెలంగాణలోని ఓ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు టీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయిన నిజామాబాద్ జిల్లాపై టీఆర్ఎస్ అంతగా ఫోకస్ పెట్టలేదనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో కవితపై ఎంపీగా గెలిచిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్... జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజపీ 28 కార్పొరేటర్లను గెలుచుకుంది.

నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును దక్కించుకున్న టీఆర్ఎస్... తాజాగా నిజామాబాద్ జిల్లాపై మళ్లీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేశ్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం... కవితను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలపడం వంటి ఇందులో భాగమే అనే చర్చ కూడా సాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్... ఆ తరువాత మాత్రం అక్కడ వెనుకబడిపోవడానికి కారణాలపై కేసీఆర్ సీరియస్‌గానే ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌ను మళ్లీ బలోపేతం చేసే విషయంలో గులాబీ బాస్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.

First published: March 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading