కేసీఆర్ నయా ప్లాన్... సెంటిమెంట్ సీటుపై ఫోకస్

తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌పై కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: February 18, 2020, 8:15 PM IST
కేసీఆర్ నయా ప్లాన్... సెంటిమెంట్ సీటుపై ఫోకస్
కేటీఆర్, కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా... దాని వెనుక అనేక కారణాలు ఉంటాయనే టాక్ ఉంది. తాజాగా సీఎం కేసీఆర్ తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌పై ఎక్కువగా ఫోకన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉందేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ కరీంనగర్‌పై ఇంతగా ఫోకస్ చేయడం వెనుక అసలు కారణంగా మరొకటి ఉందనే ప్రచారం సాగుతోంది.

త్వరలోనే తన సీఎం పదవిని తనయుడు కేటీఆర్‌కు అప్పగించాలనే యోచనలో ఉన్న కేసీఆర్... ఆ తరువాత జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తప్పాలని భావిస్తే... ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేసీఆర్ తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్‌ను ఎంపిక చేసుకున్నారని... రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ గెలిచిన కరీంనగర్ స్థానాన్ని... రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుచుకోవాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని తెలుస్తోంది. కరీంనగర్‌లో తాను పోటీ చేయడం ద్వారా ఉత్తర తెలంగాణవ్యాప్తంగా బీజేపీకి చెక్ చెప్పొచ్చని భావనలో కేసీఆర్ ఉన్నారనే విశ్లేషణులు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అచ్చొచ్చిన కరీంనగర్‌పై కేసీఆర్ ఫోకస్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు