Home /News /politics /

CM KCR SHOULD MAKE KTR AS CHIEF MINISTER SAYS CPI NARAYANA AK

‘కేటీఆర్‌ను సీఎం చేసి కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలి’

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CPI Narayana comments on KTR: పరిపాలన మొత్తం అధికారికంగానే కేటీఆర్‌కు అప్పగించడం వల్ల అతడు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

    KTR News: తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎ కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌హౌజ్‌కు పరిమితమవుతున్నారని నారాయణ అన్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగించకుండా కేటీఆర్‌ను సీఎం చేసి కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని నారాయణ తెలిపారు. పరిపాలన మొత్తం అధికారికంగానే కేటీఆర్‌కు అప్పగించడం వల్ల అతడు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. వరదల కారణంగా దెబ్బతిన్న వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు.

    Ktr as cm, cpi Narayana new demand to kcr, ktr as telangana cm, cpi Narayana comments on cm kcr, telangana news, trs news, ముఖ్యమంత్రిగా కేటీఆర్, సీఎంగా కేటీఆర్, కేసీఆర్‌కు సీపీఐ నారాయణ సలహా, తెలంగాణ సీఎంగా కేటీఆర్, కేసీఆర్‌పై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
    సీపీఐ నేత నారాయణ(ఫైల్ ఫోటో)


    రెండు రోజుల క్రితం వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ రూ. 10 కోట్లు కేటాయించి వెళ్లిపోయారని నారాయణ అన్నారు. వరంగల్‌లో పరిస్థితులు మెరుగుపడాలంటే దాదాపు రూ. 1000 కోట్లు కేటాయించాలని తెలిపారు. వరదలకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని మంత్రి కేటీఆర్ అన్నారని.. అయితే ఆక్రమణల్లో ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులే ఇన్వాల్వ్ అయ్యారని ఆయన ఆరోపించారు. అలాంటప్పుడు కేటీఆర్ చెప్పినట్టు ఆక్రమణల తొలగింపు ఏ రకంగా సాధ్యమవుతుందని నారాయణ ప్రశ్నించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, CPI Narayana, KTR, Telangana

    తదుపరి వార్తలు