Home /News /politics /

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం సాగింది.

    తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ
    సందర్బంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టు వద్దని ఆనాడు వ్యతిరేకించామన్నారు గులాబీ బాస్. ఇందిరా సాగర్ పేరుతో పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఈ విషయం రికార్డుల్లో ఉందని, కావాలంటే చూసుకోవాలని విపక్షాలకు సూచించారు.

    ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం సాగింది. . ప్రాజెక్టులు పూర్తవుతుంటే... ప్రతిపక్షం కళ్లు ఉన్న కబోదుల్లా మారారన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేసీఆర్. భక్త రామదాసు ప్రాజెక్టు కనిపించడం లేదా ? అంటూ మండిపడ్డారు. ఐదేళ్లుగా ప్రతిపక్షం ఒకే పాట పాడుతుందన్నారు కేసీఆర్
    First published:

    Tags: CM KCR, Polavaram, Telangana Politics

    తదుపరి వార్తలు