ఇది తిరుగులేని తీర్పు.. కేటీఆర్‌కు ఆశీస్సులు: సీఎం కేసీఆర్

ఈ తరహా విజయాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలు జరగకుండా విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్న ఆయన.. అలాంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు.


Updated: January 25, 2020, 5:52 PM IST
ఇది తిరుగులేని తీర్పు.. కేటీఆర్‌కు ఆశీస్సులు: సీఎం కేసీఆర్
కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు అద్భుత విజయం అందించారని సీఎం కేసీఆర్ అన్నారు. లక్ష్యం కోసం పనిచేయాలంట మళ్లీ తమను ఆశీర్వదించారని హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఇలా అన్ని ఎన్నికల్లోనూ తమకే పట్టం గట్టారని చెప్పారు. ఈ తరహా విజయాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలు జరగకుండా విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్న ఆయన.. అలాంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు.  ప్రజల ఆకాంక్షలనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేస్తారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌కు తన ఆశీస్సులు తెలుపుతున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్.

మేం పెద్దగా ప్రచారం చేయలేదు. కేటీఆర్ దావోస్‌కు వెళ్లారు. ఈ ఎన్నికల్లో నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఎక్కడా అధికార దర్వినియోగానికి పాల్పడలేదు. వేల కోట్లు ఖర్చుచేశామని ఎలా అంటారు. మేం రూ.80 లక్షల మేర పార్టీ మెటీరియల్ మాత్రమే పంపించాం. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విపక్ష నేతలకు విలువలు లేవు. సీఎంను, మంత్రులను ఇష్టమొచినట్లు తిట్టారు. ఇప్పటిదాకా విపక్షాల వ్యక్తిగత దూషణలను సహించం. ఇకపై ఊరుకోబోం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థాయిని మించి, హోదాను మించి అధిక ప్రసంగాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలి.
కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందలను తెలిపిన సీఎం కేసీఆర్.. విజయం కోసం పనిచేసిన మంత్రులు, నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు