TSRTC Strike | కార్మికులతో మాట్లాడండి.... ఎమ్మెల్యేలు కేసీఆర్ కొత్త బాధ్యతలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు తమ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి... వారు విధుల్లో చేరే ఒప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 25, 2019, 5:26 PM IST
TSRTC Strike | కార్మికులతో మాట్లాడండి.... ఎమ్మెల్యేలు కేసీఆర్ కొత్త బాధ్యతలు
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే అని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కార్మికులు తమ సంస్థను తామే నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. దీంతో కార్మికులు తమ భవిష్యత్ కార్యాచరణపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే సమ్మె విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. దీంతో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకొచ్చే బాధ్యతను తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు తమ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి... వారు విధుల్లో చేరే ఒప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యే కార్మికులు, స్థానిక కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కొంతమంది కార్మికులు విధుల్లో చేరేలా చేయగలిగినా... ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకవచ్చనే భావనలో ఉన్న ప్రభుత్వం... ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు కూకట్ పల్లి డిపోకు చెందిన రాజు అనే డ్రైవర్... కార్మిక సంఘం నేత అశ్వత్ధామరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో పాటు విధుల్లో చేరారు. ఇదే రకంగా మరికొందరు కార్మికులను విధుల్లో చేర్పించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కార్మిక సంఘాలతో ఆర్టీసీ ఈడీ కమిటీ సంఘం చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా అంశాలపై సానుకూలంగా వ్యవహరించాలని కమిటీ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సమ్మెను ముగించేందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: October 25, 2019, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading