• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CM KCR ORDERED MINISTERS AND MLAS TO STAY IN CONSTITUENCIES TILL MLC ELECTIONS OF TELANGANA AK

K Chandrashekar Rao: పార్టీ నేతలకు కేసీఆర్ లక్ష్మణరేఖ.. అప్పటివరకు బార్డర్ దాటొద్దన్న గులాబీ బాస్

K Chandrashekar Rao: పార్టీ నేతలకు కేసీఆర్ లక్ష్మణరేఖ.. అప్పటివరకు బార్డర్ దాటొద్దన్న గులాబీ బాస్

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

Telangana MLC Elections: ఎన్నికలు మరో పది రోజులే ఉన్నాయని... అత్యవసరమైతే తప్ప ఆ జిల్లాలు, నియోజకవర్గాలను విడిచి రావద్దని నేతలకు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.

  • Share this:
    తెలంగాణలో త్వరలోనే జరగనున్న రెండు పట్టభద్ర స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఈ రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకుని బీజేపీ దూకుడుకు చెక్ పెట్టడంతో పాటు తెలంగాణలో తమ రాజకీయ ఆధిపత్యం కొనాసాగుతోందనే సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మొత్తం ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్ర ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికలపై సీఎ కేసీఆర్ ఎప్పటికప్పుడు మంత్రులకు, ఇతర నేతలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ ఎన్నికలు తమ పార్టీకి ఎంత ముఖ్యమో ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని వారిని ఆదేశించారు. ఈ స్థానాల పరిధిలోని మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో, వారి వారి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులు సురభివాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల విజయానికి కృషి చేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు.

    నిన్న యాదాద్రి పర్యటన అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫోన్‌లో మాట్లాడారు. 77 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవిగా భావించాలని సూచించారు. ఎన్నికలు మరో పది రోజులే ఉన్నాయని... అత్యవసరమైతే తప్ప ఆ జిల్లాలు, నియోజకవర్గాలను విడిచి రావద్దని నేతలకు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.

    జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి 50 మంది ఓటర్లకో ఇన్‌ఛార్జి చొప్పున మొత్తం 3,400 మందిని నియమించి నగరంలోని 1,53,383 మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఇప్పటికే 90 శాతం ఓటర్లను పార్టీ శ్రేణులు కలిశాయని నేతలు కేసీఆర్‌కు సూచించారు. మిగిలిన పదిశాతం ఓటర్లను సైతం వెంటనే కలవాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తయ్యే వరకు మంత్రులు సహా నేతలంతా తమకు కేటాయించిన ప్రాంతాల నుంచి ఎక్కడికి వెళ్లొద్దని సీఎం కేసీఆర్ గట్టి ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: