నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ఖరారు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చిన కవిత.. ఇప్పుడు తాజా నిర్ణయంతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనబోతున్నారు. రాజ్యసభకు నామినేట్ చేస్తారంటూ వార్తలు వచ్చినా, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పాలుపంచుకొనేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆమె రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానానికే ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడుతున్న కవితకు సీఎం కేసీఆర్ మరో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి మహిళా ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న కవితకు.. మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. తన కేబినెట్లోకి తీసుకొని కీలక శాఖ అప్పగిస్తారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీమతి @RaoKavitha గారి పేరును పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ ఖరారు చేసారు. ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. pic.twitter.com/qY9MGVpoGh
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.