news18-telugu
Updated: August 26, 2018, 9:37 PM IST
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామిలు కూడా కేసీఆర్ వెంట వెళ్లారు. కొత్త జోనల్ వ్యవస్థ, కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు, గోదావరి కృష్ణా నీటి పంపకాలు, షెడ్యూల్ 9,10లోని సంస్థల విభజన, హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కేసీఆర్ రాజ్‌నాథ్‌తో చర్చించినట్టు సమాచారం.
రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు మూడు వినతి పత్రాలు సమర్పించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం రావాల్సిన నాలుగో విడుత నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.అలాగే తెలంగాణ వార్షిక రుణ పరిమితిని మరో 0.50 శాతం పెంచాలని కోరారు.డ్వాక్రా సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వం వాటాను విడుదల చేయాలని కోరారు. ఇక సోమవారం కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవనున్నారు కేసీఆర్.
కాగా, కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముందస్తు ఎన్నికలతో ముడిపడి ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్రంలో వాడి వేడి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే.. మోదీతో భేటీలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారని విశ్వసనీయ సమాచారం. ముందస్తు ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగించి మార్గం సుగమం చేయాలని ఆయన మోదీని కోరినట్టు తెలుస్తోంది. తక్కువ సమయమే ఉన్నప్పటికీ.. ఎన్నికలకు వెళ్లేందుకు తాము అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని ఆయన మోదీతో పేర్కొనట్టు సమాచారం.
Published by:
Srinivas Mittapalli
First published:
August 26, 2018, 5:25 PM IST