ఎన్‌పీఆర్ కుదరదు.. గవర్నర్‌కు తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్..

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)ప్రక్రియను తెలంగాణలో చేపట్టలేమని సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌లో అభ్యంతరకర, అదనపు ప్రశ్నలు ఉన్నాయని, అందువల్ల దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.

news18-telugu
Updated: March 5, 2020, 7:29 AM IST
ఎన్‌పీఆర్ కుదరదు.. గవర్నర్‌కు తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్..
గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్
  • Share this:
జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)ప్రక్రియను తెలంగాణలో చేపట్టలేమని సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌లో అభ్యంతరకర, అదనపు ప్రశ్నలు ఉన్నాయని, అందువల్ల దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. సీఏఏకి వ్యతిరేకంగా బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం చేస్తామని, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని కోరినట్లు తెలిసింది. నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన సీఎం.. మంత్రివర్గం ఆమోదించిన బడ్జెట్‌ ప్రసంగ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌పై మాట్లాడుతూ.. ప్రక్రియలో భాగంగా వివరాల సేకరణపై ప్రజల్లో ఆందోళన ఉందని, దీంతో ఇప్పటికిప్పుడు ఎన్‌పీఆర్‌ను అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పినట్లు సమాచారం.

కాగా, ఈ నెల 6వ తేదీన ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలకు హాజరై, ప్రారంభ ప్రసంగం చేయాలని గవర్నర్‌ను సీఎం కోరారు. వాస్తవిక పరిస్థితులే ప్రాతిపదికగా బడ్జెట్‌ ఉంటుందని సీఎం తెలిపారు. అటు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 5, 2020, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading