హోమ్ /వార్తలు /National రాజకీయం /

KCR Meets Amit Shah: అమిత్ షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. పలు కీలక అంశాలపై చర్చ..

KCR Meets Amit Shah: అమిత్ షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. పలు కీలక అంశాలపై చర్చ..

సీఎం కేసీఆర్, హోం మంత్రి అమిత్ షా

సీఎం కేసీఆర్, హోం మంత్రి అమిత్ షా

KCR Meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసిని విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే నేడు హోం మంత్రి అమిత్ షా(Home Minister Amith Shah) ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల‌పై చ‌ర్చించి, విన‌తిప‌త్రాలను సీఎం కేసీఆర్(CM KCR) సమర్పించారు.

ఇంకా చదవండి ...

ఢిల్లీ (Delhi) పర్యటనలో సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ నిన్న ప్రధాని నరేంద్ర మోదీని(Prime Minister Nareder Modi) కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ.. పది విజ్ఞప్తులను ప్రధాని(PM) దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 8 నెలల తర్వాత ప్రధానితో సమావేశమమైన కేసీఆర్‌.. 50 నిమిషాలపాటు మోదీతో చర్చించారు. ఇందులో ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్‌(Hyderabad) – నాగ్‌పూర్‌(Napur) ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. తర్వాత నాలుగో రోజు అంటే శనివారం కూడా కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. నేటి పర్యటనలో భాగంగా.. పలువరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌. ముఖ్యంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం క‌లిశారు.

Etala Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రా.. నేనే అన్ని ఏర్పాట్లు చేస్తానన్న ఈటల వెనుక అంతర్యం ఏమిటి..?

ఈ స‌మావేశంలో అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల‌పై సీఎం చ‌ర్చించి, విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఐపీఎస్ క్యాడ‌ర్ రివ్యూ, విభ‌జ‌న చ‌ట్టం హామీల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగా.. ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్.. తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరారు.

CM KCR : ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ సమావేశం.. కృష్ణా జలాల వివాదంపై చర్చ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తుండటంతో.. ప్రధాని మోదీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా, సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.

సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీని కలిసి యాదాద్రి దేవ‌స్థానం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..

ఈ సంద‌ర్భంగా కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్‌ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్‌వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రాలు సమ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే.

కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని మోదీకి విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, హైదరాబాద్‌లో ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి తగిన రీతిలో సహకరించాల్సిందిగా సీఎం కోరారు. అమిత్ షా తో సీఎం కేసీఆర్ పలు అంశాలపై 45 నిమిషాల చర్చించారు.  శనివారం సాయంత్రం 4.00 గంటలకు  మంత్రితో భేటీ ముగిసింది.

First published:

Tags: Amit Shah, CM KCR, Pm modi, Telangana

ఉత్తమ కథలు