Home /News /politics /

CM KCR MEETING WITH HARISH RAO AND CS IN PRAGATHI BHAWAN TO DISCUSS ON ASSEMBLY BUDGET SESSIONS SK

Telangana: మంత్రి హరీష్ రావుతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

Telangana: మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించున్నట్లు తెలుస్తోంది.

    తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శనివారం మంత్రి హరీష్ రావుతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో హరీష్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యలు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ రూపకల్పనపై సమీక్షిస్తున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తీదీలను ఖరారు చేసే అవకాశముంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముంది. మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించున్నట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Harish Rao, Hyderabad, Pragathi Bhawan, Telangana

    తదుపరి వార్తలు