RTC Strike: ఆర్టీసీ సమ్మె... నెక్ట్స్ ఏంటి… కేసీఆర్ దూకుడు ?

ఆర్టీసీ అంశంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకు సాగుతారా ? లేక హుజూర్ నగర్ వచ్చేంతవరకు ఆగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: October 21, 2019, 7:07 PM IST
RTC Strike: ఆర్టీసీ సమ్మె... నెక్ట్స్ ఏంటి… కేసీఆర్ దూకుడు ?
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణ ప్రజానీకం దృష్టిని ఆకర్షించిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంశం ఈ నెల 24న తేలనుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగిసిన తరువాత ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ సమ్మెపై ఇప్పటివరకు కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్... ఉప ఎన్నిక పూర్తయిన తరువాత సమ్మెపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

కార్మికుల సమ్మెలో ఉన్నా... బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతోనే పూర్తిస్థాయిలో నడపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఆర్టీసీలోకి మరిన్ని ప్రైవేటు బస్సులను తీసుకునే చర్యలను కూడా ప్రభుత్వం వేగవంతం చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో... అటు కోర్టులో వాదనలు వినిపిస్తూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఆర్టీసీ అంశంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకు సాగుతారా ? లేక హుజూర్ నగర్ వచ్చేంతవరకు ఆగుతారా అన్నది చూడాలి.

First published: October 21, 2019, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading