• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CM KCR MAY FINALIZE KESHAVA RAO AND PONGULETI SRINIVASA REDDY NAMES FOR RAJYA SABHA FROM TRS AK

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..?

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..?

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

ఏపీలో వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లే నలుగురి పేర్లను సీఎం జగన్ ఖరారు చేయగా... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • Share this:
    టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లే నలుగురి పేర్లను సీఎం జగన్ ఖరారు చేయగా... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కేసీఆర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారా ? లేక ఇంకా అభ్యర్థుల ఎంపిక గురించి కసరత్తు చేస్తున్నారా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు వెళ్లే ఇద్దరు నేతలు దాదాపుగా ఖరారయ్యారని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావుకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇక రెండో స్థానానికి పోటీ ఎక్కువగా ఉండగా... ఈ స్థానాన్ని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖాయమైనట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని వదులుకుని నామా నాగేశ్వరరావు గెలుపు కోసం పని చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి... ఏడాదికాలంగా పార్టీ తనకు మంచి పదవి ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ వస్తున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు కూడా సన్నిహితంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు లేకపోతే... పొంగులేటి మరోసారి పార్లమెంట్‌కు వెళ్లడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: