సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ.. త్వరలో గుడ్‌న్యూస్..?

హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. దీనిపై ఇప్పుడే ప్రకటన చేయబోరని తెలుస్తోంది.

news18-telugu
Updated: October 10, 2019, 5:41 PM IST
సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ.. త్వరలో గుడ్‌న్యూస్..?
సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాల ఐకాస
news18-telugu
Updated: October 10, 2019, 5:41 PM IST
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎన్టీవో నేతలు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరువు భత్యం, పీఆర్సీపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని.. ప్రభుత్వ ఉద్యోగులకు 3.44 శాతం మేర కరువు భత్యం (డీఏ) ఇచ్చేందుకు ఆయన అంగీరించినట్లు సమాచారం. ఐతే హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. దీనిపై ఇప్పుడే ప్రకటన చేయబోరని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యాక ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారని సమాచారం. 2019, జనవరి 1 నుంచి 3.44 డీఏ వర్తింపజేస్తూ త్వరలోనే జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉన్న తరుణంలోనే సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాలు సమావేశమవడం హాట్‌టాపిక్‌గా మారింది.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...