Home /News /politics /

CM KCR LONG WAITING FOR PM MODI APPOINTMENT CENTRE YET TO CLARIFY ON PADDY PROCUREMENT MKS

ఢిల్లీలో cm kcr పడిగాపులు.. pm modi అపాయింట్మెంట్ దక్కేనా? వరి పోరులో బీజేపీపై విజయం పక్కా!!

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

ధాన్యం సేకరణపై కేంద్రం ఇస్తున్న క్లారిటీల నేపథ్యంలో వరి పోరులో బీజేపీపై గులాబీ బాస్ విజయం సాధించారనే సంకేతాలు వెలువడినట్లయింది. బియ్యం కొనుగోలుపై కేంద్రం తీరు ఎలా ఉంటుందోనని కేసీఆర్ అంచనా వేశారో ఢిల్లీలో సరిగ్గా అదే జరుగుతోందని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు..

ఇంకా చదవండి ...
వరి ధాన్యం కొనుగోళ్లు, నీటి వాటాల పంపకం, విభజన హామీల అమలు తదిర డిమాండ్లలో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ముందే చెప్పినట్లు తాడో పేడో తేల్చుకున్న తర్వాతే తిరిగి హైదరాబాద్ (Hyderabad) రావాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టి నాలుగు రోజులు గడుస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో ఆయన అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. రాబోయే రెండురోజుల్లోనైనా తెలంగాణ సీఎంకు పీఎం ఇంటర్వ్యూ ఇస్తారా? లేదా? అనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో కేసీఆర్ కు పడిగాపులు తప్పడంలేదు. అయితే, స్వయంగా తాను వెళ్లనప్పటికీ, తన మంత్రులు, అధికారుల బృందాలను మాత్రం కేసీఆర్ ఢిల్లీలో పరుగులు తీయిస్తున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం ఇస్తున్న క్లారిటీల నేపథ్యంలో వరి పోరులో బీజేపీపై గులాబీ బాస్ విజయం సాధించారనే సంకేతాలు వెలువడినట్లయింది. బియ్యం కొనుగోలుపై కేంద్రం తీరు ఎలా ఉంటుందోనని కేసీఆర్ అంచనా వేశారో ఢిల్లీలో సరిగ్గా అదే జరుగుతోందని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు..

తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన సీఎం కేసీఆర్.. తాడో పేడో తేల్చుకుంటానంటూ మొన్న ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. వరి సాగు విషయంలో కేంద్రం ఒకలా, రాష్ట్రంలోని బీజేపీ మరోలా ప్రకటనలు, వాదనలు చేయడాన్ని తప్పుపట్టిన కేసీఆర్.. అసలు కేంద్రం తెలంగాణ బియ్యాన్ని కొంటుందా? లేదా? అనే క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. గడిచిన నాలుగు రోజులుగా ఆయన ప్రధాని మోదీ పిలుపుకోసం పడిగాపులు కాస్తున్నారు. సాగు చట్టాల రద్దు, క్రిప్టో కరెన్సీ, యూపీ అసెంబ్లీ ఎన్నికలు తదితర వ్యవహారాల్లో ప్రధాని బిజీగా ఉండటంతో కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఈనెల 26 వరకూ కేసీఆర్ బృందం ఢిల్లీలోనే ఉండనుంది. కనీసం రాబోయే రెండు రోజుల్లోనైనా ఇద్దరు నేతలు కలుస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే, ప్రధాని అపాయింట్మెంట్ దొరక్కుంటే దాన్ని కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకునే అవకాశాలు లేకపోలేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

cm kcr చెప్పిందే జరిగింది -Telangana బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్రం -సాధారణ బియ్యంపైనా దాటవేతతెలంగాణలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ ను కొనబోమని కేంద్రం కుండబద్దలు కొట్టడం, అదే సమయంలో సాధారణ బియ్యం ఏ మేరకు సేకరిస్తారనేదానిపైనా క్లారిటీ ఇవ్వకపోవడం రాజకీయంగా కేసీఆర్ కు కలిసొచ్చే అంశాలుగా మారాయి. కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు, సీఎస్ సోమేశ్ సహా కీలక అధికారులు మంగళవారం నాడు కేంద్ర ఆహార, వ్యవసాయ మంత్రులైన పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్లను కలిశారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో.. తెలంగాణ బాయిల్డ్ రైస్ గింజ కూడా కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది. మరి సాధారణ బియ్యం సంగతేంటని అడగ్గా, దాటవేత ధోరణి ప్రదర్శించింది. అయినాసరే..

World Bank : జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంక్ కొత్త అప్పు -కేంద్రం ఆమోదంతో 1800కోట్లు -దేనికంటేఈ యాసంగిలో, వచ్చే వానాకాలం పంటలో పండే ధాన్యంలో ఏమేరకు కేంద్రం సేకరణ జరుపుతుందో క్లారిటీ ఇవ్వల్సిందేనని, ఏదో ఒకటి చెప్పే దాకా ఢిల్లీ నుంచి కదలబోమని తెలంగాణ మంత్రులు భీష్మించారు. దీంతో ఈనెల 26న మరోసారి సమావేశం అవుదామని, తెలంగాణలో పండే సాధారణ బియ్యాన్ని ఎంత మేరకు కేంద్ర కొంటుందో ఆ మీటింగ్ లో చెబుతామని కేంద్ర మంత్రులు బదులిచ్చారు. అయితే, తదుపరి భేటీలోనూ కేంద్రం దాటవేత వ్యూహాన్ని ఎంచుకోవచ్చని తెలంగాణ మంత్రులు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తొలి నాలుగు రోజులు.. తెలంగాణ రైతాంగానికి శుభవార్తలు వెలువడకున్నా రాజకీయంగా టీఆర్ఎస్ కు పాజిటివ్ ఫలితాలొచ్చాయి. వరి ధాన్యంపై కేంద్రం ఎంత క్లారిటీ ఇస్తే టీఆర్ఎస్ కు అంత మైలేజీ వస్తుందని, తద్వారా కేసీఆర్ చెప్పినట్లు రాష్ట్ర బీజేపీ నేతల మెడలు వంచడం ఇంకా సులువు అవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా వరి పోరులో బీజేపీపై కేసీఆర్ విజయం దాదాపు ఖాయమైందని, ఈనెల 26న జరగబోయే సమావేశంలో అది తేలుదుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక వేళ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించకుంటే, 26న మంత్రి పియూష్, తోమర్ తో జరిగే భేటీకి సీఎం కేసీఆర్ కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేవు. వరిపై కేంద్రం నుంచి స్పస్టత తీసుకున్నాక ప్రత్యామ్నాయ పంటలపై ప్రకటన చేస్తామని కేసీఆర్ ఇదివరకే చెప్పడం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Paddy, PADDY PROCUREMENT, Pm modi, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు