Home /News /politics /

CM KCR LIKELY TO SEND DAUGHTER KALVAKUNTLA KAVITHA TO RAJYA SABHA AS TRS SITTING MP BANDA PRAKASH GETS MLC MKS

kalvakuntla kavitha : మళ్లీ పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్న cm kcr కూతురు! -trs mlc భారీ ట్విస్టులు

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

గులాబీ బాస్ ఆదేశాల మేరకు రాజ్యసభ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఆయన ఎన్నిక లాంఛనమే. అయితే ఖాళీ అయిన ఎంపీ సీటులో కల్వకుంట్ల కవితను కూర్చోబెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత రాజ్యసభకు నామినేట్ అవుతారా లేక నిజామాబాద్ జిల్లా నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలికే పరిమితం అవుతారా అనేది..

ఇంకా చదవండి ...
తెలంగాణ ఉద్యమ సందర్బంలో గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా పార్లమెంటులో ఉండి పోరాడిన తీరు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తనయ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) నిజామాబాద్ ఎంపీగా పొందిన మన్ననలు అందరికీ తెలిసినవే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన కవిత.. కొన్నాళ్లు ఖాళీగా ఉండి, అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలిలోకి ఎంటరయ్యారు. మరికొద్ది రోజుల్లోనే ఆమె పదవీ కాలం ముగియనుండగా, కవితను తిరిగి ఎమ్మెల్సీని చేసేకంటే, మళ్లీ పార్లమెంటుకే పంపాలని సీఎం కేసీఆర్ (CM KCR) డిసైడైన్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో భారీ ట్విస్టుల ద్వారా సీఎం కేసీఆర్ ఇచ్చిన సంకేతాలను బట్టి కల్వకుంట్ల కవిత మళ్లీ పార్లమెంటులోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది...

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటానలోని 12 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలోని 1 ఎమ్మెల్సీ కి అభ్యర్థుల ఎంపిక ఎంపిక ప్రక్రియ అనూహ్యరీతిలో సాగుతున్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు మంగళవారం చివరి రోజు కావడంతో సీఎం కేసీఆర్ ఫైనలైజ్ చేసిన అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. కొద్ది గంటల కిందటే సిద్దిపేట కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్.. అందరినీ షాక్ కు గురిచేస్తూ రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ను సైతం ఎమ్మెల్సీగా మండలికి పంపారు. కాగా, బండ ప్రకాశ్ ఖాళీ చేసిన ఎంపీ సీటును ఎవరికి ఇస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది..

etela rajenderపై ప్రతీకారం! -cm kcr షాకింగ్ ట్విస్ట్ : సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్సీ పదవి -trs mlc వీరే


గులాబీ బాస్ ఆదేశాల మేరకు రాజ్యసభ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ బలాన్ని బట్టి ఆరుగురు ఎమ్మెల్సీల ఎన్నిక లాంఛనమే. బండ ప్రకాశ్ ను ఉన్నపళంగా పార్లమెంటు నుంచి శాసన మండలికి తీసుకురావడం వెనుక రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలో ఖాళీ చేసిన మంత్రి పదవిని తిరిగి ఆయన సామాజిక వర్గం(ముదిరాజ్) నేతకే కట్టబెట్టానే ఆలోచనలోనే కేసీఆర్.. ఎంపీ బండను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారట. చివరి నిమిషంలో ప్రకాశ్ రాక వల్ల ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ కోల్పోయిన మధుసూదనాచారిని రాజ్యసభకు పంపుతారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆ పదవికి కల్వకుంట్ల కవితనే నామినేట్ చేయబోతున్నట్లు తాజా సమాచారం.

TRS : నిన్న జిల్లా కలెక్టర్.. నేడు ఎమ్మెల్సీ : వెంకట్రామిరెడ్డికి cm kcr బంపరాఫర్


నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కల్వకుంట్ల కవిత, ఆకుల లలిత ఇద్దరి ఎమ్మెల్సీ గడువులూ ముగియగా, ఎవరు ఎమ్మెల్యే కోటాలో ఎంపికవుతారు? ఎవరు స్థానిక ఎమ్మెల్సీగా పోటీకి దిగబోతున్నారు అనే చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆకుల లలితను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు సీఎం కేసీఆర్. తద్వారా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత బరిలోకి దిగటం ఖాయమనుకునేలోపే.. సీఎం కేసీఆర్ తన కూతురిని పార్లమెంటుకు పంపబోతున్నారనే వార్తలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు నామినేషన్ గడువు ఈనెల 23 వరకు ఉన్నందున, కవిత రాజ్యసభకు నామినేట్ అవుతారా లేక జిల్లా నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలికే పరిమితం అవుతారా అనేది వచ్చే వారమే తేలనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Kalvakuntla Kavitha, Mlc elections, Telangana News, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు