Home /News /politics /

CM KCR LIKELY TO RESHUFFLE TELANGANA CABINET AFTER FULFILLING 19 MLCS ALMOST AT A TIME MKS

CM KCR మరో సంచలనం -10రోజుల్లో 19MLCలు వీరేనా, ఇద్దరికి మంత్రి పదవి? -మండలి చైర్మన్‌గా మాజీ స్పీకర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ చరిత్రలో అరుదైన సందర్భంగా 10 రోజుల వ్యవధిలో ఏకంగా 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తున్నారు. అంతేకాదు, ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ ముగిసిన వెంటనే కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న శానన మండలి చైర్మన్ పదవిని సైతం ఈక్రమంలోనే భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందనే సర్వేలు, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమితో డంగైపోయిన గులాబీ దళంలో తిరిగి ఉత్సాహం నింపే బాధ్యతను కూడా పెద్దాయనే తలకెత్తుకున్నారు. వరి సాగు విషయంలో బీజేపీతో యుద్దాన్ని ప్రకటించిన కేసీఆర్ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ కమలనాథుల్ని కంగారుపెడుతున్నారు. విపక్షాలను కన్ఫ్యూజన్ లోకి నెట్టేయడంతోపాటే స్వపక్షంలో భారీ ఎత్తున పదవుల పంపకాలు చేపట్టారు. తెలంగాణ చరిత్రలో అరుదైన సందర్భంగా 10 రోజుల వ్యవధిలో ఏకంగా 18 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తున్నారు. అంతేకాదు, ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ ముగిసిన వెంటనే కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న శానన మండలి చైర్మన్ పదవిని సైతం ఈక్రమంలోనే భర్తీ చేయనున్నారు. ప్రాబబుల్స్ జాబితా ఇలా ఉంది..

10రోజుల్లో 19MLCలు
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్, స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీలకు షెడ్యూల్ నేడు(మంగళవారం) విడుదలైంది. గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుండగా ముందస్తుగానే డిసెంబర్ లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మధ్యలో హుజూరాబాద్ ఓటమి తప్ప, పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఇప్పుడు 19 ఎమ్మెల్సీల భర్తీతో టీఆర్ఎస్ లో సందడి నెలకొంది. బలాబలాల ప్రకారం 18కి 18 ఎమ్మెల్సీ స్థానాలూ టీఆర్ఎస్ కే దక్కే అవకాశాలున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కూడా వారిదే. కాగా,

కేబినెట్ ప్రక్షాళన.. కొత్తగా ఇద్దరు?
10 రోజుల వ్యవదిలోనే 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్న సీఎం కేసీఆర్.. అదే ఊపులో కేబినెట్ ను కూడా ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కానున్న గుత్తా సుఖేందర్ రెడ్డిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని గుత్తాతో భర్తీ చేయనున్నారు. అయితే, రాబోయే కాలంలో హుజూరాబాద్ లో ఈటలను ఓడించేలా, ఆ నియోజకవర్గానికే చెందిన పాడి కౌశిక్ రెడ్డికి సైతం కేసీఆర్ కీలక పాత్ర ఇవ్వబోతున్నట్లు సమాచారం. శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా కౌశిక్ రెడ్డిని చేస్తారని ప్రచారం జరుగుతోంది. కౌశిక్ కు మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా వాదన వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డికి కాకున్నా, గుత్తాతోపాటు కచ్చితంగా ఇద్దరిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నా, వయసురీత్యా ఆయనకు అవకావాలు తక్కువని, ఎమ్మెల్సీగా తీసుకుని దళిత బంధు అమలు బాధ్యతను ఆయనకు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది.

మండలి చైర్మన్‌గా మాజీ స్పీకర్
ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసినప్పటి నుంచి శాసన మండలిలో చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం వి.భూపాల్‌రెడ్డి ప్రొటెం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కొత్తగా చేపడుతోన్న ఎమ్మెల్సీల భర్తీలో అసెంబ్లీ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. మాజీ స్పీకర్ నే మండి చైర్మన్ చేయాలనే ఆలోచన కూడా సీఎంకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆశావాహులు వీరే..
ఎమ్మెల్సీ ఆశావాహులు, సీఎం కేసీఆర్ మదిలో ఉన్నట్లుగా భావిస్తోన్న ప్రాబబుల్స్ జాబితాలో ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంసీ కోటిరెడ్డి, ఎల్‌.రమణ, పిట్టల రవీందర్‌, సీతారాంనాయక్‌, రవీందర్‌సింగ్‌, దేశపతి శ్రీనివాస్‌, రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మాదాటి రమే్‌షకుమార్‌రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, బొమ్మెర రామ్మూర్తి, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు, శ్రీహరిరావు, పీఎల్‌ శ్రీనివాస్‌, తాడూరి శ్రీనివాస్‌, చాడ కిషన్‌రెడ్డి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరుల పేర్లున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Telangana News, Trs

తదుపరి వార్తలు