Home /News /politics /

CM KCR HOLD KEY MEETING WITH TRS LEADERS TO FINALISE TRS MLC CANDIDATES LIST MKS

cm kcr : పాడి కౌశిక్ రెడ్డికి షాకా? స్వీటా? -trs కీలక నేతలతో సీఎం కేసీఆర్ భేటీ -mlc అభ్యర్థుల ఎంపిక

కేసీఆర్ తో కౌశిక్ రెడ్డి (పాత ఫొటో)

కేసీఆర్ తో కౌశిక్ రెడ్డి (పాత ఫొటో)

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియనుంది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల‌తో సీఎం కేసీఆర్ సోమ‌వారం ఉద‌యం ప్రగతి భవన్ లో స‌మావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఇవాళే ప్రకటిస్తారు..

ఇంకా చదవండి ...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (Mlc Elections) వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియనుంది. పలు సమీకరణల నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందోననే టెన్షన్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల‌తో సీఎం కేసీఆర్ సోమ‌వారం ఉద‌యం ప్రగతి భవన్ లో స‌మావేశం అయ్యారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

కాగా, గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారని, తన ఎంపికలపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకే ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో కేసీఆర్ ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయోనని అటు సిట్టింగ్స్.. ఇటు ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో మధుసూదనాచారి, ఎంసి కోటిరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎల్.రమణ, కడియం లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ లకు అవకాశం దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా,

Etela Rajender ఆ పని చేయగలరా? -cm kcrకు షాకిచ్చేలా bjp సరికొత్త వ్యూహం ఇదే..


హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉండిన కౌశిక్.. సరిగ్గా ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. అయితే టికెట్ ఆయనకు కాకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు దక్కింది. దీంతో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. కానీ కౌశిక్ ఎంపికపై గవర్నర్ తమిళిసై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అటుపై హుజూరాబాద్ ఫలితంలో టీఆర్ఎస్ ఓడిపోయి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత అసలు కౌశిక్ రెడ్డికి పదవి దక్కుతుందా? లేదా? అనే చర్చ జరిగింది. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఇవ్వాలనే సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కౌశిక్ ను ఎమ్మెల్యే కోటాకు ఎంపిక చేసి ఇవాళే శుభవార్త చెబుతారా? లేక షాకిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతున్నది. మరో అవకాశంగా..

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ఖతం -గద్దె దించనున్న ఆర్మీ -కారణాలివే -pakistan కొత్త ప్రధాని ఎవరంటే


తెలంగాణలో ఎమ్మెల్యే కోటాతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీలపైనే కేసీఆర్ నిర్ణయంతో ఇవాళ ప్రకటన రానుంది. ఆ జాబితాలో గనుక కౌశిక్ రెడ్డికి స్థానం దక్కకపోతే, స్థానిక సంస్థల కోటాలోనైనా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలకు డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాతోపాటు గవర్నర్ కోటా కలిపి మొత్తం 19 ఎమ్మెల్సీ పదవులు నెల రోజుల వ్యవధిలో భర్తీ కానున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Kaushik Reddy, Mlc elections, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు