అంతా కేటీఆరే... మరోసారి క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన పార్టీ ఎంపీల సమావేశానికి కూడా కేటీఆర్ అధ్యక్షత వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: November 15, 2019, 6:58 PM IST
అంతా కేటీఆరే... మరోసారి క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
కేటీఆర్, కేసీఆర్ ( ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్ఎస్‌లో కేసీఆర్ తరువాత నంబర్ 2 ఎవరనే ప్రశ్నకు సీఎం కేసీఆర్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన సీఎం కేసీఆర్... పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేటీఆర్‌కు ఇచ్చారనే టాక్ ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా కేటీఆర్‌ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్న కేసీఆర్... ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు నుంచి తప్పించి కవితకు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగించారు.

తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన పార్టీ ఎంపీల సమావేశానికి కూడా కేటీఆర్ అధ్యక్షత వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకుముందు ఇలాంటి సమావేశం ఎప్పుడు జరిగిన స్వయంగా సీఎం కేసీఆరే దానికి అధ్యక్షత వహిస్తూ వచ్చారు. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ సారి మాత్రం ఈ సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించి... పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఈ సమావేశంతో మరోసారి టీఆర్ఎస్‌తో తన తరువాతి స్థానం కేటీఆర్‌దే అని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే కేసీఆర్ ఆదేశాల, సూచనల మేరకే కేటీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించి... ఆయన ఆదేశాలను ఎంపీలకు తెలియజేశారనే మరో చర్చ కూడా సాగుతోంది.
First published: November 15, 2019, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading