166 మంది తహసీల్దార్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం...

166 మంది తహసీల్దార్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: November 17, 2019, 7:52 PM IST
166 మంది తహసీల్దార్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం...
సీఎం కేసీఆర్ (ఫైల్)
  • Share this:
తెలంగాణలో తహశీల్దార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని జోన్ 5లో పనిచేస్తున్న తహసీల్దార్లను వారి వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 166 మంది తహసీల్దార్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సోమేష్ కుమార్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం... వారిని సొంత జిల్లాలకు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఎన్నికల విధుల కోసం వారిని గతంలో బదిలీ చేశారు. మళ్లీ వారిని ఆయా జిల్లాలకు బదిలీ చేస్తున్నాం.’ అని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 166మంది తహసీల్దార్లను వారి విధుల నుంచి రిలీవ్ చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈనెల 18వ తేదీలోగా వారు తమ సొంత జిల్లాల్లో కలెక్టర్లకు రిపోర్టు చేసేలా చూడాలని ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు జోన్ 5 పరిధిలోకి వస్తాయి.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...