కేసీఆర్ సన్నిహితుడికి మంత్రి హోదా... ఉత్తర్వులు జారీ...

రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా కొనసాగనున్న రాజేశ్వర్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించారు.

news18-telugu
Updated: December 6, 2019, 2:32 PM IST
కేసీఆర్ సన్నిహితుడికి మంత్రి హోదా... ఉత్తర్వులు జారీ...
సీఎం కేసీఆర్
  • Share this:
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్ మరియు డైరక్టర్‌గా నియమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా కొనసాగనున్న రాజేశ్వర్ రెడ్డికి క్యాబినేట్ మినిస్టర్ హోదా కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే క్రమంలో రైతు సమన్వయ సమితిలు కీలక పాత్ర పోషిస్తాయని అనేకసార్లు తెలిపిన సీఎం కేసీఆర్... దీనికి చైర్మన్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించారు.

Cm kcr, cabinet rank, rythu samanvaya samite, palla rajeshwar reddy, సీఎం కేసీఆర్, కేబినెట్ ర్యాంకు, రైతు సమన్వయ సమితి, పల్లా రాజేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి


టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. ఆయన మంత్రి పదవి ఆశించారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ర్యాంక్‌తో కూడిన కీలక పదవికి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు.
Published by: Kishore Akkaladevi
First published: December 6, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading