నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్‌కు టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. అక్కడ విజయం కోసం వ్యూహరచనను ఖరారు చేశారు.దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని నేతలకు సీఎం కేసీఆర్ తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సీఎం సూచించారు. చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్, కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలమని తెలిపారు. ప్రచారంలో తనతో పాటు కేటీఆర్ కూడా పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సాగర్‌లో కష్టపడాలని దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి ఈసారి సాగర్‌లో మరోసారి కేసీఆర్ ప్రచారం కూడా ఉండబోతోందనే విషయం స్పష్టమవుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. అక్కడ ఎన్నికల ప్రచార భారమంతా మంత్రి హరీశ్ రావు వహించారు. అయితే ఈసారి మాత్రం నేతలంతా కష్టపడి పని చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని నేతలకు సూచించారు.
ఇక సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఎలాంటి అసమ్మతి లేకుండా ముందుగానే ప్లాన్ రెడీ చేసుకున్నారు సీఎం కేసీఆర్. అక్కడ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక మరో నాయకుడు కోటిరెడ్డికి సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పడం ద్వారా నేతలంతా పార్టీ గెలుపు కోసం కృషి చేసేలా సమాయత్తం చేశారు. మొత్తానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.