హోమ్ /వార్తలు /National రాజకీయం /

Telangana: ముందస్తు ఎన్నికలు! -ఎల్పీ భేటీలో ఖరారు? -TRS అధ్యక్ష పదవికి kcr నామినేషన్ -ఫొటో చాలు!

Telangana: ముందస్తు ఎన్నికలు! -ఎల్పీ భేటీలో ఖరారు? -TRS అధ్యక్ష పదవికి kcr నామినేషన్ -ఫొటో చాలు!

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మంత్రుల నామినేషన్

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మంత్రుల నామినేషన్

KCR TRS : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష ఎన్నిక హడావుడి కొనసాగుతోంది. నోటిఫికేషన్ ప్రకటించిన తొలిరోజే పార్టీ ఆఫీసులో కేసీఆర్ ఫొటో సాక్షిగా ఆయన తరఫున మంత్రులు నామినేషన్ వేశారు. కాగా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైనా ఎల్పీ భేటీలో కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..

ఇంకా చదవండి ...

అనూహ్య రాజకీయ ఎత్తుగడలకు కేరాఫ్ గా ఉంటోన్న కేసీఆర్ మరో అస్త్రాన్ని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు బలం పుంజుకోకముందే ముందస్తుగా దెబ్బకొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ మనసులోని భావాలను ముందస్తుగా ప్రచారంలోకి తీసుకొచ్చే కీలక వ్యక్తులు సైతం ముందస్తు ఎన్నికల రాగం పాడుతుండటంతో అది తథ్యమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం నిర్వహిస్తోన్న ఉమ్మడి ఎల్పీ(పార్లమెంటరీ, శాసనసభాపక్షాల) సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశంపై లోతైన చర్చ జరిపి, నేతలకు ఏదో ఒకటి ఖరారు చేయబోతున్నట్లు సమాచారం. అదే సమయంలో పార్టీ నిర్మాణంపైనా కేసీఆర్ నిర్దేశం చేయనున్నారు...

కేసీఆర్ నామినేషన్.. పోటీకొస్తారా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ నామినేషన్ వేశారు. స్వయంగా రాకపోయినా కేసీఆర్ తరఫున పలువురు మంత్రులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్‌ సమర్పించారు. కేసీఆర్ చిత్రపటం ఎదురుగా ఆయన తరఫున మంత్రులు నామినేషన్ పత్రాలను అధికారికి అందజేశారు. అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రి మహమూద్‌ అలీ ప్రతిపాదించగా, మంత్రులు బలపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ చీఫ్ పదవిని తిరిగి చేపట్టడం లాంఛనమే అయినప్పటికీ, కొడుకు కేటీఆర్ కు పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారాల నడుమ పోటీగా మరో నామినేషన్ దాఖలవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

25న అధ్యక్ష ఎన్నిక

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే కేసీఆర్ నామినేషన్ వేయడం గమనార్హం. ఈ ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా ఎం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించునున్నారు. ఇదిలా ఉంటే,

ముందస్తు ఎన్నికలకు సై?

టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం నాడు పార్లమెంటరీ, అసెంబ్లీ ఉమ్మడి ఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో నిర్వహించనున్న ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపైనా సమావేశంలో చర్చిస్తారని, 2023 చివర్లో జరగాల్సి అసెంబ్లీ ఎన్నికలను ఏడాది ముందుగానే, అంటే 2022 చివర్లోనే నిర్వహించే వ్యూహానికి సంబంధించి కేసీఆర్ నేతలకు నిర్దేశం చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ప్రత్యర్థులకు ఛాన్స్ లేకుండా..

ష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా బలపడకముందే ముందస్తు నిర్ణయం తీసుకోవాలని గులాబీ దళపతి యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో దుబ్బాకలో టీఆర్ఎస్ ఒడిన వెంటనే కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోయారు. ప్రస్తుత హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ ప్రతికూల ఫలితం వస్తే వెంటనే ముందస్తు వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నేతలు అధికారికంగా మాట్లాడలేదు.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Elections, Kcr, Telangana, Trs

ఉత్తమ కథలు