కేసీఆర్‌కు ముఖం లేదు... తెలంగాణ హుజూర్ నగర్ వైపు చూస్తోందన్న రేవంత్ రెడ్డి

ఆర్టీసీ కార్మికులు బుద్ధి చెబుతారనే కేసీఆర్ సభ రద్దు చేసుకున్నారని... ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నా కేసీఆర్‌లో మార్పు రావడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: October 18, 2019, 7:28 PM IST
కేసీఆర్‌కు ముఖం లేదు... తెలంగాణ హుజూర్ నగర్ వైపు చూస్తోందన్న రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 18, 2019, 7:28 PM IST
చిన్న వర్షానికే హుజూర్ నగర్‌లో సభను సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే... ముఖం లేక కేసీఆర్ ఇక్కడ ప్రచారానికి రాలేదని ఆయన ధ్వజమెత్తారు. హుజూర్ నగర్ ఉప ఇది తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఎన్నిక అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదన్న రేవంత్ రెడ్డి... హుజూర్ నగర్ అభివృద్ధి అంతా ఉత్తమ్‌తోనే జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని పాలకీడు కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోజు కేసీఆర్ జుట్టు మీకు దొరికిందని... అది వదిలితే మళ్లీ కేసీఆర్ దొరకడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికులు బుద్ధి చెబుతారనే కేసీఆర్ సభ రద్దు చేసుకున్నారని... ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతున్నా కేసీఆర్‌లో మార్పు రావడం లేదని మండిపడ్డారు. కార్మికులతో చర్చలు జరపని కేసీఆర్‌కు సీఎం పదవి ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సమాజం అంతా హుజూర్ నగర్ వైపు చూస్తోందని తెలిపారు. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కు ఓటేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ఓట్లు చీలిపోతే... మనం కూలిపోతామని అన్నారు. టీడీపీని తెలంగాణలో లేకుండా చేసిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు.First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...