• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CM KCR DID NOT INCLUDE ANTI CAA STAND IN GOVERNOR SPEECH AHEAD OF TELANGANA ASSEMBLY BUDGET SESSION AK

ఆ విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్... కారణం అదేనా ?

ఆ విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్... కారణం అదేనా ?

తమిళిసై, కేసీఆర్

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి... ఇదే విషయాన్ని గవర్నర్ ప్రసంగంలోనూ పొందుపర్చుతారని చాలామంది అంచనా వేశారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంత ఈజీగా అర్థంకావు. ఆయన ఎప్పుడు ఎలా ముందుకు సాగుతారో కూడా ఊహించడం కష్టం. తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ ప్రసంగం విషయంలోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా ? అనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి... ఇదే విషయాన్ని గవర్నర్ ప్రసంగంలోనూ పొందుపర్చుతారని చాలామంది అంచనా వేశారు. సీఏఏను వ్యతిరేకించే విషయంలో తాము గట్టిగా ముందుకు సాగుతామనే సంకేతాలు ఇవ్వాలని భావించిన సీఎం కేసీఆర్... గవర్నర్ ప్రసంగం ద్వారానే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారనే టాక్ వినిపించింది.

    అయితే ఈ విషయంలో కేరళ గవర్నర్ వ్యవహరించిన విధంగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తే దీనిపై అనవసర రాద్ధాంతం జరుగుతుందని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఎలాగూ అసెంబ్లీలో తీర్మానానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి... గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ విషయంలో కొత్త రాద్ధాంతం అవసరం లేదని సీఎం కేసీఆర్ యోచించి ఉండొచ్చని సమాచారం. ఇలా చేయడం వల్ల గవర్నర్ తమిళిసైకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన అనుకుని ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది.

    అందుకే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం పెడతామని చెప్పకుండా... మత సామరస్యానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చారు. ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందేలా... లౌకిక స్పూర్తిని కాపాడేలా త్రికరణ శుద్ధిగా పని చేస్తున్నామని గవర్నర్ ద్వారా చెప్పించారు. మొత్తానికి కేరళ అసెంబ్లీలో అక్కడి గవర్నర్ చేసిన కామెంట్స్ కారణంగానే ఇక్కడ గవర్నర్ ప్రసంగం విషయంలో కేసీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: