Home /News /politics /

CM KCR DELHI TOUR TS CM TO MEET DELHI CM ARVIND KEJRIWAL KCR LIKELY TO CAMPAIGN IN VARANASI AGAINST BJP PM MODI MKS

CM KCR: PM Modi ఇలాకా వారణాసిలో కేసీఆర్ ప్రచారం! -బీజేపీపై యుద్ధం ముమ్మరం..

కేసీఆర్ ఢిల్లీ పర్యటన

కేసీఆర్ ఢిల్లీ పర్యటన

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియా శీల పాత్ర పోషిస్తానన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతో పాటు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం.

బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. సోమవారం రాత్రే ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మూడు రోజులపాటు అక్కడే మకాం వేయనున్నారు. మంగళవారం ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్‌తో సమావేశమవుతారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలను ముమ్మరం చేయనున్నారు. సతీమణి శోభకు ఎయిమ్స్ లో టెస్టులు, ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులతోపాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది..

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియా శీల పాత్ర పోషిస్తానన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతో పాటు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసి సెగ్మెంట్ లోనే కేసీఆర్ బీజేపీ వ్యతిరేక ప్రచారం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి..

CM KCRకు పీకే-Revanth Reddyకి ఎస్కే: ముందస్తు ఎన్నికల ప్లాన్ మామూలుగా లేదు..గురువుకు షాక్?


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ తదితరులు వెళ్లే అవకాశాలున్నాయి. వీరితో పాటు కేసీఆర్‌ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మిగతా నేతలతో కలిసి వారణాసి వెళతారా? లేక విడిగా వెళతారా? అనేది తెలియాల్సి ఉంది.

Manchu Vishnu ఆఫీసులో చోరీ: కులం పేరుతో Manchu Family అమ్మ‌నా బూతులు: హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ తర్వాత పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపు ణులు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోనూ కేసీఆర్‌ వరుస భేటీలు జరుపుతారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, జాతీయ పార్టీల వైఫల్యాలు, ప్రజల ముందు పెట్టా ల్సిన ఎజెండా, కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ పార్టీలు.. సంస్థల భావసారూప్యత, ఏకతాటిపైకి రావడంలో ఉండే అవరోధాలు తదితర అంశాలపై ఈ భేటీల్లో కేసీఆర్‌ చర్చించే అవకాశముంది.

CM KCR భయం భయం.. ఉక్రెయిన్ ప్రధాని కావొచ్చు.. Prashant Kishor సీన్ ఇదే: చుగ్


ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ పనులను కూడా కేసీఆర్‌ పరిశీలిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి తెలంగాణ భవన్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే చక్రం తిప్పే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్, అదనపు డీజీ అనిల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. కేసీఆర్ సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్యపరీక్షలు చేయించుకోనున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తినెలకొంది.
Published by:Madhu Kota
First published:

Tags: Aravind Kejriwal, Assembly Election 2022, Bjp, CM KCR, Delhi, Pm modi, Trs, Varanasi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు