కేసీఆర్ సరికొత్త నిర్ణయం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా... ఎమ్మెల్యేలు ఆశించిన విధంగా పని చేయకపోతే... క్షేత్రస్థాయిలో వాటి అమలు అంత సులువు కాదనే భావనలో కేసీఆర్ ఉన్నారు.

news18-telugu
Updated: February 22, 2020, 8:54 AM IST
కేసీఆర్ సరికొత్త నిర్ణయం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్
కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇవ్వనున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్న ఎమ్మెల్యేలకు... సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పరిపాలన విషయంలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్న కేసీఆర్... ఇందుకోసం ఇప్పటికే పలు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. మరికొన్ని కీలక చట్టాలు కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా... ఎమ్మెల్యేలు ఆశించిన విధంగా పని చేయకపోతే... క్షేత్రస్థాయిలో వాటి అమలు అంత సులువు కాదనే భావనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే ఎమ్మెల్యే పనితీరుకు పరీక్ష పెట్టాలని ఆయన డిసైడయినట్టు తెలుస్తోంది.

ఇందుకోసం త్వరలోనే ఎమ్మెల్యేలకు ప్రొగ్రెస్ కార్డులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని ఎప్పటికప్పుడు వారికి సూచించే గులాబీ బాస్... ఈ విషయంలో గతంలో అంత సీరియస్‌గా ఉన్న సందర్భాలు పెద్దగా లేవు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... మరో రెండు మూడు దఫాలు అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రొగ్రెస్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నారు.

పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఆరు నెలల పాటు సమయం ఇచ్చి... ఆ తరువాత వారికి ప్రొగ్రెస్ కార్డులు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఇందుకు సంబంధించి స్పష్టమైన సూచనలు చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. మొత్తానికి గతంలో ఎమ్మెల్యేలు గెలిపించుకునే బాధ్యత తనదే అని వారికి ధీమా ఇచ్చిన కేసీఆర్... ఈ సారి మాత్రం వారి పనితీరుకు వారిదే బాధ్యత అని కుండబద్ధలు కొట్టబోతున్నట్టు అర్థమవుతోంది.First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు