రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ

రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 11:30 AM IST
రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్‌ మీటింగ్ లో పలు నూతన అంశాలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్‌ సమావేశాలపై మంత్రివర్గం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరునున్నట్లు తెలుస్తోంది.






First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు