CM KCR CLOSE AIDE DR MARRI YADAVA REDDY GETS TRS MLC FROM MEDAK DISTRICT MKS MDK
Dr Marri Yadava Reddy : సీఎం కేసీఆర్ సన్నిహితుడికే మెదక్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ తో డాక్టర్ మర్రి యాదవ రెడ్డి
సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోనూ ఈసారి కొత్త వారికి అవకాశాలు లభించాయి. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ కు చెందిన, సీఎంకు సన్నిహితుడైన డాక్టర్ మర్రి యాదవ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది..
(K.Veeranna,News18,Medak)
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ఆసక్తికరంగా సాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) అనూహ్య ఎత్తుగడలు అవలంభించారు. ఎమ్మెల్సీ కోటా మాదిరిగానే స్థానిక సంస్థల కోటాలో 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోనూ ఈసారి కొత్త వారికి అవకాశాలు లభించాయి. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ కు చెందిన, సీఎంకు సన్నిహితుడైన డాక్టర్ మర్రి యాదవ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లడానికి ముందే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయగా, నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తున్నారు.
మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ కు నమ్మకస్తుడిగా పేరుపొందిన డాక్టర్ మర్రి యాదవ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. స్థానిక ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు అవకాశం దక్కింది. దాంతో ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకున్న యాదవ రెడ్డికి సముచిత స్థానం దక్కిందని గజ్వేల్ గులాబీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోటీ లేకుండా సునాయాసంగా గెలిచే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ లో ఆశావాహులు ఎకకువ మందే ఉన్నా ఎమ్మెల్సీ అవకాశం ఆయనకే దక్కడ గమనార్హం.
ఇదీ నేపథ్యం..
ఉస్మానియా మెడికల్ కాలేజీలో విధ్యనభ్యసించిన మర్రి యాదవ రెడ్డి.. గజ్వేల్ పట్టణంలో డాక్టర్ వృత్తి చేపట్టి విస్తృత సేవలందించారు. 1978 సంవత్సరం నుండి క్రీయాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. వివిధ ధశల్లో పలు హోదాల్లో పార్టీ పదవులను అలంకరించారు. మాజీ మంత్రి గీతారెడ్డికి నాడు అనుంగ అనుచరుడిగా ప్రత్యేక గుర్తింపు పోందారు. తదనంతరం గజ్వేల్ మాజీ ఎంఎల్ఎ నర్సారెడ్డికి గీతారెడ్డి అధిక ప్రాధన్యత ఇస్తున్నారని తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదనే కారణంతో కాంగ్రెస్ ను వీడి 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రికి గజ్వేల్లో ప్రధాన అనుచరుడిగా కోనసాగుతున్నారు.
గజ్వేల్ మార్కెట్ పై తనదైన ముద్ర..
కాంగ్రెస్ పార్టీలో యాదవరెడ్డికి గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ గా ఎన్నికయ్యారు. నాటి కాలంలో గజ్వేల్ ఎంఎల్ఎ తర్వాత అంతటి డిమాండ్ కల్గిన పదవిగా మార్కెట్ కమిటి చైర్మన్ గిరికి ఉండేది. 2006 సంవత్సరం నుండి 2010 వరకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. తన హోదాకు తగిన పదవి కాదని సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం వచ్చినా దాన్ని సున్నితంగా తిరస్కరించారు.
ముఖ్యమంత్రితో డాక్టర్ సాబ్ సాన్నిహిత్యం..
2014 ఎన్నికలకు ముందు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్థానికంగా పార్టీ క్యాడర్ అంతంత మాత్రమే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో క్రీయాశీలకంగా పని చేస్తున్న యాదవ రెడ్డి తెరాసలో చేరడం పార్టీకి బాగానే కలిసోచ్చింది. ఎదురు లేని మెజార్టీతో విజయం సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నడు. 2018 ఎన్నికల్లోనూ కేసీఆర్ గెలుపుకు విశేషంగా కృషి చేయడంతో యాదవ రెడ్డి ఆయన దృష్టిని ఆకర్షించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.