కేరళలో అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

అక్కడి నుంచి కేసీఆర్ నేరుగా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లాడు. తెల్లపంచ కట్టుకున్న సీఎం.. స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ ఉన్నారు.

news18-telugu
Updated: May 6, 2019, 6:42 PM IST
కేరళలో అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్
  • Share this:
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో తెలుగు సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ నేరుగా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లారు. తెల్లపంచ కట్టుకున్న సీఎం.. స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ ఉన్నారు. మరికాసేపట్లో కేరళ సీఎం పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కూడా సందర్శిస్తారు.

కాగా, కేసీఆర్ కేరళ టూర్ వెనక పలు అనుమానాలు తావిస్తున్నాయి. కేరళ సీఎం విజయన్‌తో చర్చించడం ద్వారా జాతీయస్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేయడానికి సుముఖంగానే ఉన్నట్టు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ కేరళ టూర్ వెనుక మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం జాతీయస్థాయిలోని నేతల్లో ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీలు పోరాటం చేసిన సమయంలోనూ కేసీఆర్ వారికి మద్దతు ఇవ్వలేదనే అపవాదు ఉంది. ఈ అపవాదును తొలగించుకోవడం కోసమే కేసీఆర్ కేరళ టూర్ ప్లాన్ చేశారని... లెఫ్ట్ పార్టీలకు చెందిన సీఎంతో చర్చలు జరపడం ద్వారా బీజేపీకి తాము దూరమనే సంకేతాలను జాతీయ నేతలకు ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తాను బీజేపీకి దూరమని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను కూడా తనవైపు తిప్పుకోవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Video:-కేరళలో అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

First published: May 6, 2019, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading