ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతాం : సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ఈ ప్రణాళిక అమలు కావాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.

news18-telugu
Updated: September 3, 2019, 9:38 PM IST
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతాం : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (File Photo)
news18-telugu
Updated: September 3, 2019, 9:38 PM IST
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ జాబితా రూపొందించాలని.. తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగులకు ముందే తెలిసి ఉండాలని అన్నారు. తద్వారా పదోన్నతుల కోసం పైరవీలు చేసే పద్దతి పోవాలన్నారు.పల్లెల్లో 60 రోజుల
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై చర్చించేందుకు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక పల్లెల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పారిశుధ్యం కాపాడే విధులు, పచ్చదనం పెంచే విధులు, నిధులు సద్వినియోగం చేసే విధులు, పరిపాలనా విధులు, విద్యుత్ సంబంధిత లక్ష్యాలను సిఎం విడివిడిగా విడమరిచి చెప్పారు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ఈ ప్రణాళిక అమలు కావాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.మొదటిరోజు గ్రామ సభ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. మొదటిరోజు సభలో సీఎం సందేశాన్ని గ్రామస్తులకు చదివి వినిపించాలని.. మరుసటిరోజు కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశించారు.

కోఆప్షన్ సభ్యులుగా సర్పంచ్ కుటుంబ సభ్యులు ఉండరాదని ప్రభుత్వం నిబంధన పెట్టిందన్నారు. కోఆప్షన్,స్టాండింగ్ కమిటీ సభ్యుల నియామకం కోసం చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.60 రోజుల కార్యాచరణలో భాగంగా స్మశాన వాటికలు,డంపింగ్ యార్డులకు కావాల్సిన స్థలం ఎంపిక చేయాలన్నారు. సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్వ్కాడ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయని తెలిపారు. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు,నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...