CM KCR AND TRS USING BJP DECISION ON KARIMNAGAR EX MAYOR RAVINDAR SINGH TARGETING ETELA RAJENDAR AK
Telangana: Etela Rajendar విషయంలో బీజేపీ నిర్ణయం KCRకు కలిసొచ్చిందా ?
కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Telangana News: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా ఫోకస్ కాకుండా చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్కు ఇది అనుకోని అవకాశంగా మారిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పోరాటాన్ని ఉధృతంగా చేయడం వెనుక అసలు కారణం ఇదే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందనే సంకేతాలు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి హుజూరాబాద్ ఉప ఎన్నికలు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్పై గెలవడం కమలం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఈటల రాజేందర్ ఎక్కువగా తన సొంత ఇమేజ్ కారణంగానే గెలిచారనే వాదన ఉన్నా.. బీజేపీ మాత్రం తెలంగాణ తమకు పెరుగుతున్న ఆదరణకు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఒక నిదర్శనమని చెప్పుకుంటోంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత బీజేపీలో ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యత పెరుగుతుందని.. ఆయనకు బీజేపీ జాతీయ నాయకత్వం మంచి గుర్తింపు ఇవ్వడంతో పాటు కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి.
ఒక దశలో కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈటల రాజేందర్‌ను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈటల రాజేందర్‌కు బీజేపీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే ప్రచారం సాగుతోంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ మద్దతుతో టీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగిన రవీందర్ సింగ్ వ్యవహారం ఆయనకు పెద్ద మైనస్‌గా మారిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈటల రాజేందర్ ద్వారా రవీందర్ సింగ్ బీజేపీలో చేరి ఉంటే.. బీజేపీలో ఆయనకు ఉండే ప్రాధాన్యత పెరిగేదని.. కానీ రవీందర్ సింగ్‌కు బీజేపీ నో ఎంట్రీ బోర్డు పెట్టడం.. ఆయన మళ్లీ టీఆర్ఎస్లో చేరడంతో..బీజేపీలో ఈటల రాజేందర్ ప్రాధాన్యతపై మరోసారి చర్చ మొదలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా ఫోకస్ కాకుండా చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్కు ఇది అనుకోని అవకాశంగా మారిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. నిజానికి ఈటల రాజేందర్ ద్వారా టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలను గుర్తించి బీజేపీలోకి తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు కొంతకాలంగా వార్తలు వచ్చాయి.
అయితే తెలంగాణ ఉద్యమంలో పని.. మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతూ వస్తున్న రవీందర్ సింగ్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు ఆ పార్టీతో పాటు ఈటల రాజేందర్‌కు కూడా ఇబ్బందిగా మారింది. రవీందర్ సింగ్ ఎపిసోడ్ కారణంగా ఈటల రాజేందర్ ద్వారా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు నేతలెవరూ పెద్దగా ముందుకు రావడం లేదనే ఊహాగానాలు కూడా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో మొదలయ్యాయి. బీజేపీ అంతర్గత పరిణామాలు ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ ప్లాన్‌కు కలిసొచ్చే విధంగా ఉన్నాయనే టాక్ కూడా మొదలైంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.