కేసీఆర్‌కు దూరంగా రేవంత్ రెడ్డి... గవర్నర్ విందులో ఆసక్తికర సన్నివేశం

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో సందడి చేశారు. విందుకు వచ్చిన ప్రముఖులను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పలకరించారు.

news18-telugu
Updated: August 15, 2019, 7:18 PM IST
కేసీఆర్‌కు దూరంగా రేవంత్ రెడ్డి... గవర్నర్ విందులో ఆసక్తికర సన్నివేశం
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
పంద్రాగస్టు సందర్భంగా తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. విందుకు వచ్చిన ప్రముఖులను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పలకరించారు. అయితే కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ మాత్రం ఒకరినొకరు కలుసుకోలేదు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి వారితో కరచాలనం చేసిన సీఎం కేసీఆర్... రేవంత్ రెడ్డిని మాత్రం పలకరించకుండా అలా వెళ్లిపోయారు.

ఇక రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్‌ను కలవకుండా కేవలం గవర్నర్ నరసింహన్‌ను మాత్రమే కలిశారు. కార్యక్రమంలో కొద్దిసేపు గడిపిన రేవంత్ రెడ్డి... మిగతా నేతల కంటే ముందుగానే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా హాజరైన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావు హాజరుకాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం వేర్వేరు గవర్నర్‌ను నియమించడంతో... ఈ సారి నరసింహన్ ఇచ్చిన విందుకు ఏపీకి చెందిన ప్రముఖ నాయకులెవరూ హాజరుకాలేదు.First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు