కీలక పదవులపై కేటీఆర్ కసరత్తు... కేసీఆరే ఫైనల్...

ఇప్పటికే 110కి పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్న టీఆర్ఎస్... ఇండిపెండెంట్ల సహకారంతో మరికొన్ని మున్సిపాలిటీలను కూడా తమ సొంతం చేసుకోవాలనే అంశంపై దృష్టి సారించింది.

news18-telugu
Updated: January 26, 2020, 6:05 PM IST
కీలక పదవులపై కేటీఆర్ కసరత్తు... కేసీఆరే ఫైనల్...
కేటీఆర్, కేసీఆర్
  • Share this:
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్... తాజాగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చైర్‌పర్సన్, మేయర్ల ఎంపికపై ఫోకస్ చేస్తోంది. రేపు జరగనున్న మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. స్ధానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీకి కనీసం రెండు చొప్పున పేర్లను పంపాల్సిందిగా అదేశించారు. ఈ మేరకు ప్రాథమిక జాబితాను సిద్దం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎంపికలో ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, సామాజిక సమీకరణాలు, స్ధానికంగా పార్టీకి అవసరమైన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. పార్టీ నిర్ణయాన్ని రేపు ఉదయంలోగా స్థానిక నాయకత్వానికి తెలియజేయనుంది.

కీలక పదవులపై కేటీఆర్ కసరత్తు... కేసీఆరే ఫైనల్... | Cm kcr and ktr to take final decision on chairpersons and mayors ak
పార్టీ నేతలతో కేటీఆర్ రివ్యూ


ఇప్పటికే 110కి పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్న టీఆర్ఎస్... ఇండిపెండెంట్ల సహకారంతో మరికొన్ని మున్సిపాలిటీలను కూడా తమ సొంతం చేసుకోవాలనే అంశంపై దృష్టి సారించింది. దీనితో పాటు పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఉండే ఎక్స్ అఫీషియో సభ్యుల బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యులను స్ధానికంగా ఏయే పురపాలక సంఘాలను ఎంచుకోవాలో అంశంపై పార్టీ కీలక సూచనలు చేస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట్ల, ఒకటి, రెండు ఓట్లు అవసరం అయిన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీకున్న ఎక్స్ అఫీషియో బలం వల్ల ఇలాంటి పురపాలక సంఘాల్లో టీఆర్ఎస్ విజయం ఖాయంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: January 26, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading