కేసీఆర్, కేటీఆర్ ఫెయిల్... ఇదిగో సాక్ష్యామన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: September 3, 2019, 1:42 PM IST
కేసీఆర్, కేటీఆర్ ఫెయిల్... ఇదిగో సాక్ష్యామన్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న శాఖలు, గతంలో కేటీఆర్ దగ్గర ఉన్న ఐటీ శాఖలు దారుణంగా ఫెయిలయ్యాయని కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇచ్చిన తాజాగా నివేదికలో కేసీఆర్ దగ్గర ఉన్న సాగునీటి, విద్యుత్ శాఖలకు 8, 11 ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖకు 18 ర్యాంకు వచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నివేదికను బట్టి పరిపాలన విషయంలో సీఎం కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ పూర్తిగా ఫెయిలయ్యారని అర్థమవుతోందని ఆరోపించారు.

దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూయార్క్ సెంటర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్ట్ కంపెనీ యాడ్ ఇస్తే... దాన్ని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిని తాను పూర్తిస్థాయి ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో ఈ ర్యాంకులను చూస్తే అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.


First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>