కేసీఆర్ నోట మళ్లీ అదే మాట... వ్యూహమేంటి ?

గత అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ తనవంతు ప్రయత్నాలు చేశారు.

news18-telugu
Updated: January 25, 2020, 7:02 PM IST
కేసీఆర్ నోట మళ్లీ అదే మాట... వ్యూహమేంటి ?
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ నోట మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ మాట రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అన్నారు. దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ రెండూ ఫెయిలయ్యాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇందుకోసం తాను మళ్లీ పని చేస్తానని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ తనవంతు ప్రయత్నాలు చేశారు. దేశంలోని కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలను కలిసి ఈ అంశంపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల తరువాత హంగ్ ఏర్పడితే ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కానీ దేశంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో దీనిపై కేసీఆర్ సైలెంట్ అయిపోయారు.

అయితే తాజాగా సీఏఏ విషయంలో కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్న కేసీఆర్... అదే అంశం ఆధారంగా మళ్లీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకంగా చేయాలనే వ్యూహంతో ఉన్నారా ? అనే చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లో సీఏఏపై తానే ప్రాంతీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్... అవసరమైతే దీనిపై హైదరాబాద్‌లో భారీ సభ పెడతానని అన్నారు. దీంతో కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ కోసం తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ నోట మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ మాట రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు