రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. అమిత్ షాతోనూ..!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా దక్కినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

news18-telugu
Updated: January 17, 2020, 11:48 AM IST
రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. అమిత్ షాతోనూ..!
నరేంద్ర మోదీ, వైఎస్ జగన్ (ఫైల్)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా దక్కినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రేపు మొత్తం సీఎం జగన్ ఢిల్లీలోనే గడపనున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ రోజు సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉన్నా.. ప్రభుత్వ పనిలో బిజీగా ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని కోర్టును విన్నవించారు. ఆయన అభ్యర్థనను కోర్టు స్వీకరించింది. విజయసాయిరెడ్డి మాత్రం కోర్టుకు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, హైపవర్ కమిటీతో సీఎం జగన్ భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. భేటీలో కమిటీ సభ్యులు రాజధాని వికేంద్రీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అమరావతి రైతుల సమస్యలపైనా సీఎంకు వివరించనున్నారు.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు