ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు విజయవాడ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గన్నవరంలో ఘనస్వాగతం లభించింది. జగన్ కోసం అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే అభిమానులు హంగామా చేశారు. ‘సీఎం.. సీఎం..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి.. వెళ్లిపోయే వరకు నినాదాలతో హోరెత్తించారు. అభిమానులను హడావిడి చూసిన జగన్ వారిని నవ్వుతూ పలకరించి ముందుకు వెళ్లిపోయారు. మే 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో జగన్ సీఎం కావడం ఖాయమనే ధీమా వైసీపీ అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలో జగన్ ప్రమాణస్వీకారం కావడం మాత్రమే ఆలస్యం అని వారు భావిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.