చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ. 200 : జగన్

చంద్రబాబు హయాంలో ఉల్లిని గిట్టుబాటు ధర లేక పంటను పొలాల్లోనే వదిలేశారని గుర్తు చేశారు.

news18-telugu
Updated: December 9, 2019, 12:08 PM IST
చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ. 200 : జగన్
గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీకి ప్రజలు ఓటేశారు.
  • Share this:
ఉల్లి ధరలపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ మండిపడ్డారు. ఏపీలో కిలో ఉల్లి రైతు బజార్లలో రూ. 25 కే అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు హయాంలో ఉల్లిని గిట్టుబాటు ధర లేక పంటను పొలాల్లోనే వదిలేశారని గుర్తు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ రేట్లకు అమ్ముతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఏపీ ఒక్కటే కిలో ఉల్లి రూ. 25కు అందిస్తున్నామన్నారు జగన్. ఏపీలో ఉల్లి ధరలు మండిపోతున్నాయన్న టీడీపీ వ్యాఖ్యలకు భగ్గుమన్న సీఎం జగన్.. చంద్రబాబు హెరిటేజ్ షాపులోనే కేజీ ఉల్లి రూ. 200కు అమ్ముతున్నారంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి.

 
First published: December 9, 2019, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading