కాల్‌మనీ,సెక్స్‌రాకెట్‌ రిపీట్ అవ్వొద్దు... రెండోరోజు కలెక్టర్ల సదస్సులో జగన్

గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుతామన్నారు జగన్.

news18-telugu
Updated: June 25, 2019, 11:52 AM IST
కాల్‌మనీ,సెక్స్‌రాకెట్‌ రిపీట్ అవ్వొద్దు... రెండోరోజు కలెక్టర్ల సదస్సులో జగన్
సమీక్షా సమావేశంలో సీఎం జగన్
  • Share this:
ఉండవల్లిలోని ప్రజా వేదిక లో మంగళవారం కలెక్టర్లు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎస్పీ లతో , కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లా అండ్ ఆర్డర్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ విషయంలో సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఏ పార్టీ పారు ఉన్నా విడిచిపెట్టొద్దన్నారు. పోలీస్ వ్యవస్థను క్లీన్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు జగన్.

గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్‌ నిర్వహిస్తామని తెలిపారు. గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుతామన్నారు. ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్‌లతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో రావాలని అధికారుల్ని ఆదేశించారు. మళ్లీ గిరిపుత్రులు గంజాయి సాగులోకి రాకుండా జీవనోపాధికి పరిష్కారాలు చూపించాలన్నారు.

రెండో రోజు జరుగుతున్న ఈ సదస్సులో ఎస్పీ లు, జిల్లా కలెక్టర్ లు, పోలీస్ ఉన్నతాధికారుల తో రెవిన్యూ (ల్యాండ్), హోమ్, రవాణా, రహదారుల భవనాల, కమిషనర్ రవాణా, స్పెషల్ సీఎస్ (ఎక్స్ జ్), ఎక్స్ జ్ కమిషనర్, పరిశ్రమలు శాఖ కార్యదర్శి, కమిషనర్లు, మహిళా స్త్రీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం, డిజిపి గౌతమ్ సవాంగ్ , 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కెఆర్ కిషోర్ కుమార్ , ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. అనంతరం డిజిపి రూపొందించిన ఎజెండా అంశంపై జిల్లా కలెక్టర్ లతో పోలీస్ శాఖ కు సంబంధించిన సమీక్ష నిర్వహిస్తారు.First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>