Andhra Pradesh: ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!

ఏపీలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సిబ్బందికి శుభవార్త చెప్పింది. వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: September 26, 2020, 4:41 PM IST
Andhra Pradesh: ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!
ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్ల ప్రొబేషన్ కాలంతో సిబ్బందిని విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో మహిళా సిబ్బందికి ప్రసూతి సెలవులను ప్రభుత్వం ఇవ్వలేదు.

దీంతో అనేకమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో వారంతా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. వాటిని పరిగణలోకి తీసుకున్న జగన్ సర్కార్ వారికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ధి చేకూరనుంది. దీంతో వారంతా జగన్ సర్కారు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Published by: Nikhil Kumar S
First published: September 26, 2020, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading