Home /News /politics /

ఇవాళ రాత్రి ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం?

ఇవాళ రాత్రి ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం?

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

మండలి రద్దే అజెండాగా కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు మండలి కార్యదర్శికి కూడా వైసీపీ లేఖ ఇవ్వనుంది.

    ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంటున్న నేపథ్యంలోమండలిని రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించినట్లు కూడా సమాచారం. మరోవైపు మండలి రద్దుకు సంబంధించి న్యాయ పరమైన అంశాలను వైసీపీ, టీడీపీ పరిశీలిస్తున్నాయి. మండలి రద్దే అజెండాగా కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు మండలి కార్యదర్శికి కూడా వైసీపీ లేఖ ఇవ్వనుంది.

    మరోవైపు టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు వార్తల్ని కొట్టి పారేస్తోంది. శాసనమండలిని జగన్ ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వస్తున్న వ్యాఖ్యలపై అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రులు యనమల, నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. మండలి రద్దు అనేది అంత సులభమైన ప్రక్రియ కాదన్నారు. పార్లమెంట్ నిర్ణయంతో మండలి రద్దు సాధ్యం అవుతున్నందాన్నారు. శాసన మండలిని రద్దు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుందన్నారు యనమల. మండలి రద్దు చేస్తారంటే టీడీపీ సభ్యులు ఎవరూ ఈ విషయంలో భయ పడటం లేదన్నారు నారా లోకేష్.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP Assembly, Ap legislative council, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు