జగన్ దూకుడు... ఆ నిర్ణయంపై మరింత ముందుకు...

ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలనే తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: November 13, 2019, 6:23 PM IST
జగన్ దూకుడు... ఆ నిర్ణయంపై మరింత ముందుకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
విపక్షాలు ఎంతగా నిరసన వ్యక్తం చేస్తున్నా... ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలనే తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తాము తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదని సీఎం జగన్ సహా పలువురు ఏపీ మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా... ఈ విషయంలో ప్రభుత్వం ముందుకే వెళుతుందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రక్రియ మొదలుపెట్టేందుకు ఓ ప్రత్యేక అధికారి పర్యవేక్షణ అవసరం అని భావించిన ఏపీ ప్రభుత్వం... ఇందుకోసం ఓ ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్ అధికారి వెట్రిసిల్వికి ఏపీ ప్రభుత్వం ఈ మేరకు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం వెట్రిసిల్వి సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ప్రాజెట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మొత్తానికి విపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నా... ఈ విషయంలో మాత్రం ఏపీ సీఎం జగన్ దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించినట్టు అర్థమవుతోంది.First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...